కంచరపాలెం బిజెపి అధ్యక్షురాలు గా హిమబిందు

 కంచరపాలెం జనసేవ న్యూస్ 
భారతీయ జనతా పార్టీ కంచరపాలెం మండల (56,57 వార్డు) నూతన అధ్యక్షురాలిగా కోరుబిల్లి హిమబిందు ని నియమించడం జరిగింది. ఆదివారం ఉదయం జిల్లా అధ్యక్షులైన మేడపాటి రవీంద్ర రెడ్డి నియామక పత్రం ఇచ్చి బాధ్యతలు అప్పగించారు. 

ఈ సందర్భంగ కోరుబిల్లి హిమబిందు మాట్లాడుతూ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. 
నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీన్ మాధవ్ కి, జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర రెడ్డి కి, జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు భోగాది స్వామి నాయుడు కి ధన్యవాదాలు తెలియజేశారు. 
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్ల మహేష్ , ఎల్లపు నర్సింగరావు, దాసరి శివ శంకర్ రావు పాల్గొన్నారు.

జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )