పచ్చదనానికి ప్రతీకగా వేములవలస

 ఆనందపురం జనసేవ న్యూస్ 
వాతావరణ సమతుల్యత, పరిరక్షణ కోసం వేములవలస పంచాయితీలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడానికి పంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ కృష్ణాష్టమి 

పర్వదినం పురస్కరించుకొని శ్రీకారం చుట్టారు. ముందుగా అతని ఇంటి ఆవరణలో తల్లిదండ్రులు మాజీ సర్పంచ్ కోరాడ అరుణజ్యోతి, భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కోరాడ నాగభూషణరావు ల ఆశీర్వాదాలు తీసుకుని మొక్కలు నాటారు.

 ఈ సందర్భంగా కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ మండలంలోని వేములవలస పంచాయతీని పచ్చదనంలో మేటిగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.

 సర్పంచ్ లంక కొండమ్మ, పాలకవర్గం సభ్యుల సమన్వయంతో పంచాయతీ పరిధిలో గల అన్ని చోట్ల విరివిగా మొక్కలు నాటడానికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
 ఇందుకు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ కోరారు.

జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )