లారీ డ్రైవర్ అదృశ్యం

*లారీ డ్రైవర్ అదృశ్యం* : 

ఆనందపురం మండలంలోని ముకుందపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ దుంప అప్పలరాము అదృశ్యం పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల మద్యానికి బానిస కావడం తో కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీన మందుల కోసమని ఇంటి నుంచి వెళ్లిన అప్పలరాము సాయంత్రమైన తిరిగి రాలేదు. దీంతో బంధువుల ఇళ్లల్లో, చుట్టు పక్కల గ్రామాల్లో వెతికిన అతని ఆచూకీ లభ్యం కాలేదు. భార్య ముత్యాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Reporter 
సురేశ్