కుసులువాడలో పచ్చ తోరణం

కుసులువాడలో పచ్చ తోరణం
ఆనందపురం:జనసేవ న్యూస్ 
 మండలంలోని కుసులు వాడ ఎస్సీ కాలనీలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ మహంతి వెంకటలక్ష్మిశివాజీ ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు.
 ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటలక్ష్మి శివాజీ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యానికి విరివిగా మొక్కలు పెంచాలన్నారు. తద్వారా వాతావరణ సమతుల్యత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మహంతి శివాజీ, పిల్లా జట్లాయ్య, రవ్వ అప్పారావు, వీ ఆర్ పి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )