హెచ్.ఎస్ గోవింద్ కు ఘన సన్మానం

 ఆనందపురం జనసేవ న్యూస్ 

ఆనందపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ ఐ.గోవింద రావు ను ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్.సునీల్ గారు ఆధ్వర్యంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరియు సచివాలయం ఎ. ఎన్. ఎమ్ లు ఆశా కార్యకర్తలు అందరు కలిసి సన్మానించడం జరిగింది. ఆయన సేవలను అభినందిస్తూ సన్మానం చేయడం జరిగింది.

 అతని సేవలను అందరూ ప్రశంసించారు. ఎల్లవేళలా వచ్చిన రోగులకు అందుబాటులో ఉంటూ ఓపి సేవలను విశేషంగా తీసుకుంటారు. చిరు మందహాసంతో అందరినీ ఆకట్టుకునే గోవింద రావు గారికి ఈ అవార్డు రావడం పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్)