లలిత మోటార్స్ ను ప్రారంభించిన మంత్రి అవంతి

లలిత మోటార్స్ ను ప్రారంభించిన మంత్రి అవంతి
 ఆనందపురం : జనసేవ న్యూస్
 ఆనందపురం కూడలి నుండి బంటుపల్లి వెళ్లే మార్గంలో ఏర్పాటైన లలిత ఈ.వి మోటార్స్ ను మంత్రి అవంతి శ్రీనివాస్ రావు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధి లో సంస్థ ముందుండాలని అన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తెచ్చే విధంగా సంస్థ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
 కార్యక్రమంలో లలిత ఈ.వి. మోటార్స్ అధినేత ఆకుల లలిత, రాయల్ ఈ. వి. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీహరి, ఆకుల శంకర్రావు, ఆకుల శ్రీను స్థానిక నాయకులు పాల్గొన్నారు.

జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )