సంబరంగా రాఖీ పండుగ వేడుకలు

ఆనందపురం:జనసేవ న్యూస్
 కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు రక్షాబంధన్ వేడుకలను ఆదివారం సంబరంగా జరుపుకున్నారు. కుటుంబ బాంధవ్యాల తో పెనవేసుకున్న ఈ పండుగను వేడుకగా జరుపుకోవడమే విశేషం.

ఆత్మీయతా, అనురాగాలతో బాంధవ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ హుషారుగా జరిపారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ పండగ గా విశేషంగా కనిపించింది. ఉదయాన్నే లేచి స్నానపానాదులు గావించి రాఖీలు కట్టించుకునే బిజీ లో పడ్డారు. 

పెద్ద వారి కంటే ముందుగానే వీరు తయారవటం అందరికీ ఆనందం సంబరంగా రాఖీ పండుగ వేడుకలు. ఆత్మీయ, ఆలోచనల్ని తోబుట్టువు హృదయ స్పందనల్ని రక్త బంధం తో ముడి వేసే ఈ పండుగను అందరూ జరుపుకోవడం మానవతా విలువలకు దర్పణం పట్టింది.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )