జియో నెట్వర్క్ సేవలు భేష్

జియో నెట్వర్క్ సేవలు భేష్....!
ఆనందపురం:జనసేవ న్యూస్
 మండలంలోని వేములవలస పంచాయతీ జంక్షన్ లో జియో మార్ట్ ను స్థానిక ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ శుక్రవారం ఉదయం లాంచనంగా ప్రారంభించారు. 
 అనంతరం ఆయన మాట్లాడుతూ జియో నెట్వర్క్ సంస్థ అతి తక్కువ కాలంలో మంచి ప్రాచుర్యం పొందిందని అన్నారు. 
పేద బడుగు బలహీన వర్గాలకు అందుబాటులోకి తీసుకొచ్చే ఏకైక సంస్థ గా ప్రశంసించారు. 
ఈ కార్యక్రమంలో కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తో పాటు జియో సంస్థ జె.సి.ఎమ్ నగేష్ పాల్గొన్నారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )