పంటలను పరిశీలించిన ప్రసాద్ రావు పట్నాయక్

పంటలను పరిశీలించిన ప్రసాద్ రావు పట్నాయక్
ఆనందపురం :జనసేవ న్యూస్ 
వెల్లంకి లో పంటలను పరిశీలించిన బిజేపి విశాఖ పార్లమెంట్ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్. ఆనందపురం మండలం వెల్లంకి గ్రామపంచాయతీ పరిధిలో బిజేపి విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి, పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ వ్యవసాయ పంటలు పరిశీలించి రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. 
ఈ సందర్భంగా రైతులు తమ అభిప్రాయాలు లో వేల్లంకి లో జిల్లాలో పేరుపొందిన వెల్లంకి వంకాయ అలాగే అరటి, దొండ, పూల తోటలో సొంతంగా చేసినా గిట్టుబాటు ధర రావడంలేదని అందుకే మేము వ్యవసాయం మానేసి కూలి పని చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కార మార్గం ప్రభుత్వాల నూతన చట్టం తీసుకురావాలని రైతుకు గిట్టుబాటు ధర చెల్లించాలని రైతులకు ప్రతి నెల పెన్షన్ రూపం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ చట్టo రైతులకు అనుకూలంగా ఉందని దళారీ వ్యవస్థ రద్దు చేయాలని రైతులకు అనుకూలంగా బిజేపి ప్రభుత్వం ద్వారా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఒక్క రైతు కుటుంబం లబ్ధి పొందుతున్నారని ఇంకా అర్హులైన రైతులకు అందడం లేదని అవి అందేటట్లు చూడాలనే అలాగే రైతులకు కిషన్ క్రెడిట్ కార్డులు మా రైతులందరికీ అందేటట్లు చూడాలని కోరారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )