ఆనందపురం:జనసేవ న్యూస్
స్థానిక జడ్పీ హైస్కూల్ మరియు ఎం.పీ.పీ స్కూల్ లో జగనన్న విద్యాకానుక కార్యక్రమం ఆనందపురం గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి చందక లక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఉచితంగా బై-లింగువల్ పాఠ్యపుస్తకాలు, నోటుబ్బుక్లు, వర్క్ బుకు,3 జతల యూనిఫాం క్లాత్ కుట్టు కూలితో సహా, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగు తో పాటు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ అందజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో చందక లక్ష్మి, చందక సూరిబాబు, ఎం.ఈ.ఓ, జడ్పీ-హైస్కూల్ హెచ్.ఎం, ఎంపీపీ స్కూల్ హెచ్.ఎం, షిణగం పెద్ద రామారావు, షిణగం చిన్న రామారావు, చందక అప్పలస్వామి , అప్పలనాయుడు, చందక శంకర్, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )