యువతే దేశానికి వెన్నుముఖ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్

ఆనందపురం:జనసేవ న్యూస్
 దేశానికి యువతే వెన్నుముఖ అని అభివర్ణిస్తూ వారు సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని వేములవలస ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని వేములవలసలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత పెడత్రోవ పడకుండా వారి లక్ష్యాలను ఛేదించే దిశగా అడుగులు వేయాలన్నారు.
 సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించి తమ సత్తా చాటుకోవాలని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఉండి తమ ప్రతిభాపాటవాలను చాటి చెప్పాలి అన్నారు. సన్మార్గంలో వెళ్తూ సామాజిక రుగ్మతలపై దృష్టి పెట్టాలన్నారు. యువత తలచుకుంటే ఏదైనా చేయొచ్చు అనే విధంగా ప్రవర్తన శైలిలో మార్పులు తెచ్చుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ హితవుపలికారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )