రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఆనందపురం:జనసేవ న్యూస్ 
 ఆనందపురం నుండి పెందుర్తికి వెళ్లే రాష్ట్ర రహదారి లో సొంట్యం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలవగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. 
 ఆనందపురం మండలం కనమాం గ్రామానికి చెందిన ఎర్ర కన్నారావు (55), 

అతని భార్య వరలక్ష్మి, కొడుకు జోగారావు బైక్ పై వెళ్తుండగా ఆనందపురం నుండి పెందుర్తి వైపు వస్తున్న వ్యాన్ బలంగా ఢీకొంది. 

ఈ ఘటనలో ఎర్ర కన్నారావు అక్కడికక్కడే మృతిచెందగా మిగతా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కేసును ఆనందపురం సిఐ వై.రవి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్యాంసుందర్ దర్యాప్తు చేస్తున్నారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )