హెల్త్ సూపర్వైజర్ గోవింద్ కు సత్కారం

హెల్త్ సూపర్వైజర్ గోవింద్ కు సత్కారం
ఆనందపురం:జనసేవ న్యూస్

 స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న ఐ.గోవిందరావుకు అరుదైన పురస్కారం దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కోవిడ్ ఫ్రంట్ వారియర్స్ గా ఉంటూ అతను బాధ్యతలు విధులు సక్రమంగా నిర్వహించడం తో అతన్ని సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. 
ఈ కార్యక్రమంలో శ్రీ వెంకట విద్యాపీఠ్ వారి సౌజన్యంతో సొంట్యం గ్రామంలో సన్మానం చేయడం జరిగింది. సభకు మాజీ సర్పంచ్ లెంక రాంబాబు, ప్రస్తుత సర్పంచ్ లెంక లావణ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. గోవిందరావును మిగతా సిబ్బంది స్పూర్తిగా తీసుకోవాలని కొనియాడారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )