రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ... టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

 *ఆనందపురం* : 
ఇటీవల హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్యకు న్యాయం చేయాలని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కొర్రయి తేజ ఆశిష్ అన్నారు. 
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్  ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం మండలంలోని వెల్లంకి గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు.

 ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగునాడు విద్యార్థి సమైక్య నాయకులు లెంక సురేష్ మాట్లాడుతూ దిశ చట్టం ప్రకారం 14-రోజుల్లో  విచారణ పూర్తి చేసి, 21-రోజుల్లో శిక్ష వేస్తామని సాక్షాత్తు మన ప్రజాప్రతినిధులే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, అలాంటప్పుడు నిందితుడు వీడియో లో సాక్ష్యం తో దొరికిన ఇప్పటికి రమ్య కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదు అని ప్రశ్నించారు. 

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ కరువైందని, ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని అన్నారు. లేని చట్టాన్ని తెచ్చి ఆడబిడ్డలను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు అండగా, భాదితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో  పైల రమేష్ , తాటిశెట్టి సురేష్, సాయి, కొమ్ము సురేష్, కొర్రయి సునీల్, ప్.రాజు తదితరులు పాల్గొన్నారు.

Reporter
సురేశ్