8న. ఉచిత వైద్య శిబిరం

8న. ఉచిత వైద్య శిబిరం
ఆనందపురం :జనసేవ న్యూస్

 వృంద ఆసుపత్రి సౌజన్యంతో ఆర్.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కంఫర్ట్ హోమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ ఆదివారం పెందుర్తి మండలం పురుషోత్తపురం సమీపంలో గల కృష్ణరాయపురం లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు గ్రామీణ వైద్యుల సంఘం విశాఖ సిటీ ఇన్ ఛార్జ్ ఆకుల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 
ఈ శరీరంలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలతోపాటు క్యాన్సర్ పై అవగాహన కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విమ్స్ ఏ. వో. షేక్ బజిత్ వ్యవహరించగా ప్రముఖ వైద్యులు డాక్టర్ వంశీధర్ పుట్రేవు, డాక్టర్ రోజారాణి బలగా, కే.భ్రమర కుమారి శిబిరానికి హాజరై సేవలు అందిస్తారని ఆకుల శ్రీనివాసరావు తన ప్రకటనలో పేర్కొన్నారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )