ఆనందపురం లో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆనందపురం లో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఆనందపురం :జనసేవ న్యూస్
 మండల కేంద్రమైన ఆనందపురం పంచాయతీలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 
స్థానిక సర్పంచ్ చందక లక్ష్మి పతాకావిష్కరణ జరిపి మాట్లాడారు. మహానుభావుల పోరాటాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించింది అన్నారు. అలాంటి మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా ప్రజలందరూ నడుచుకోవాలని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సహకార సంఘం మాజీ అధ్యక్షుడు చందక సూరిబాబు , గ్రామ కార్యదర్శి మూర్తి (బాబీ ) విఆర్ఒ రెడ్డి, షినగం రామారావు, చందక అప్పలస్వామి, షినగం చిన రామారావు, పాలకవర్గ సభ్యులతోపాటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )