ముందస్తు అరెస్టు అయిన టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు లెంక సురేష్ :
ఆనందపురం : జాబ్ క్యాలండర్ అని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి వెంటనే కొత్త జాబ్ క్యాలండర్ ను విడుదల చేయాలనే డిమాండ్ తో టిఎన్ఎస్ఎఫ్,
ఇతర విద్యార్థి సంఘాలు మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఛలో తాడేపల్లి కార్యక్రమంలో భాగంగా తెలుగునాడు విద్యార్థి సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి లెంక సురేష్ ను తన నివాసం వద్ద ఆనందపురం SI శ్రీనివాస్ రావు గారు ముందస్తు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా లెంక సురేష్ మాట్లాడుతూ ఎటువంటి తప్పు చేయకుండా ప్రభుత్వం ముందస్తు అరెస్టులను ఎందుకు చేయిస్తుందో ప్రజలు అంత గమనిస్తున్నారు అని, ముఖ్యమంత్రి గారికి యువత పై చిత్తశుద్ధి ఉంటే వెంటనే నూతన జాబ్ క్యాలండర్ ను విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలి అని అన్నారు.
జనసేవ రిపోర్టర్
సురేష్
Other post