నిత్య అమావాస్య వేములవలస బస్ స్టాప్ Nitya Amavasya Vemulavalasa Bus Stop

నిత్య అమావాస్య వేములవలస బస్ స్టాప్ : 



 ఆనందపురం : నిత్యం రద్దీగా ఉండే వేములవలస బస్ స్టాప్ వద్ద గల లైట్లు గత కొన్ని రోజులుగా వెలగకపోవడంతో  నిత్య అమావాస్య ను తలపిస్తుంది. 

ఇక్కడకి ప్రతీ రోజు విశాఖపట్నం నుంచి రాత్రి 11 గంటలకు పలుకుల వృత్తి వారు, ఉద్యోగులు, వ్యాపారస్తులతో రాకపోకలు జరుపుతూ ఉంటారు వారు లైట్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

 ఇప్పుడు ఉన్న పరిస్థితులలో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ గా జరుగుతుండటంతో స్థానిక ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

 లైట్లు లేకపోవడంతో ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉందని వాహనదారులు అంటున్నారు. కావున ఎప్పటికైనా పంచాయతీ పెద్దలు లైట్లు ఏర్పాటు చేస్తారని స్థానికులు, ప్రయాణికులు, వాహనదారులు కోరుచున్నారు.


                                                                                                                                రిపోర్టర్

                                                                                                                                  సురేష్