బొగ్గు లారీ దగ్ధం l అగనంపూడి

 *అగనంపూడి* : 

అగనంపూడి బ్రిడ్జి వద్ద బొగ్గు లోడుతో ఉన్న లారీ దగ్దమైంది. గంగవరం పోర్ట్ నుంచి పెద్దాపురం వెళుతున్న బొగ్గు లోడు తో ఉన్న లారీ లో ఒక్కసారిగా పెద్ద పెద్ద మంటలు భారీగా చెలరేగడం వలన మిగతా వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 


లారీ డ్రైవర్, స్థానికులు అదుపుతేవటానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది, దీనితో లారీ పూర్తిగా దగ్దమైంది. లారీ డ్రైవర్ అప్రమత్తం అవ్వటం వలన పెనుప్రమాదం తప్పి,


 ప్రాణ నష్టం ఏమి జరగలేదు. షర్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగి ఉండవచ్చు అని ప్రాధమికంగా పోలీసులు అంచనవేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేస్తామని చెప్పారు.

జనసేవ రిపోర్టర్

సురేష్

దయచేసి ఈ పోస్ట్ అందరికీ పంచుకోండి