ఈ ఏడాది గిరి ప్రదర్శణ రద్దు

ఈ ఏడాది గిరి ప్రదర్శణ రద్దు

 సింహాచలం : జనసేవ న్యూస్ 

రాష్ట్ర ప్రభుత్వం కరోన నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సింహగిరి గిరి ప్రదర్శణ రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు. 

ప్రతీ ఏటా శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి కొండ చుట్టూ సుమారు 36 కి.మీ భక్తులు కాలినడకన ప్రదర్శణ చేస్తూ ఉంటారు


ఈ వేడుకకు చుట్టూ ప్రక్కల జిల్లాల నుంచి కూడా లక్షల్లో భక్తులు పాల్గొటారు. 
కానీ ఈ సంవత్సరం గిరి ప్రదర్శణ రద్దు చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.
 
ఈ నెల 23,24 తేదీలలో మాత్రం స్వామి వారి దర్శనాలు కరోన నిబంధనలు పాటిస్తూ యధావిధిగా ఉంటాయని చెప్పారు. 

23న స్వామి వారి మాస జయంతి


24వ తేదీన తుది విడత చందన సమర్పణ ఉంటాయి అని అన్నారు. స్వామి వారి దర్శన కు హాజరవుతున్న భక్తులు తప్పక మాస్కులు ధరించి, కరోన నిబంధనలు పాటించాలని ఈవో సూర్యకళ తెలిపారు.

జనసేవ న్యూస్ 
సురేశ్