విజయసాయిరెడ్డి పై ఘాటు విమర్శలు చేసిన పాశర్ల

విజయసాయిరెడ్డి పై ఘాటు విమర్శలు చేసిన పాశర్ల


విశాఖపట్నం : వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ ఘాటు గా విమర్శించారు. ఆయన తన తోటి కమిటీ సభ్యులతో జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసాయిరెడ్డి నగరంలో గల తమ పార్టీ నాయకులను, ముఖ్యంగా కార్పొరేటర్ లను బెదిరించి, భయ భ్రాంతులకు గురుచేస్తూ, ఆఫర్లు ఇస్తూ వైసిపి వైపు తిప్పుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు. 
ఇదే జరిగిన పార్టీ కి పోయేది ఏమి లేదు అని అలా బెదిరింపులకు లోనయ్యే వారు, ఆఫర్లకు ఆశ పడే తప్పుడు నాయకులను తీసుకొని వెళ్లి మా పార్టీని శుద్ధి చేస్తూ, ఒకరకంగా విజయసాయిరెడ్డి మా పార్టీకి మంచి చేస్తున్నారు అని అన్నారు. 


విజయసాయిరెడ్డి పై ఘాటు విమర్శలు చేసిన పాశర్ల

తెలుగుదేశం పార్టీ మహా వృక్షం అని ఒక పెద్ద యూనివర్సిటీ అని ఇందులో పల్లా శ్రీనివాస్ యాదవ్, సబ్బం హరి, మోత్కుపల్లి భరత్ లాంటి తాటాకు చప్పుళ్లకు భయపడని వారు కూడా ఉన్నారు అని ఆయన అన్నారు. 

వైసిపి ప్రభుత్వం అవినీతి పాలనకు పరాకాష్ట అని, టీడీపీ వాళ్ళు భూ కబ్జా చేస్తున్నారు అన్నడం దొంగలే దొంగ అని అన్నట్టుగా ఉంది అని తమ పార్టీ నాయకులు, యలమంచిలి శాసనసభ్యులు కన్నబాబు రాజు సీతమ్మధారలో 750 గజాలు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు అని దీనిని ఎందుకు తొలగించ లేదు అని ప్రశ్నించారు.

మరో నేత బొడ్డేటి కాశీ విశ్వనాధ్ సర్వే నె0-275 లో 250 గజాల భవనం అక్రమంగా కాట్టింది కదా, తమ శిష్యుడు ఉత్తర నియోజకవర్గం ఇంచార్జీ కె.కె.రాజు 2019లో తనకు కావలసిన వాళ్ళ కోసం మాధవధార వద్ద  వివాదంలో ఉన్న  సర్వే నె0:47,48 8-ఎకరాల సింహాచలం భూమిని ఆక్రమించలేదా అని ప్రశ్నించారు. 

సింహాచలం లో 45-లక్షల విలువైన గ్రావేల్ కు సంబంధించి విజిలెన్స్ ఎంక్వరీ ఏమైంది అని ప్రశ్నించారు. ఆఖరికి స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రతో కుమ్మక్కు అయ్యి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని, నిజంగా మీరు స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకం అయితే 28వ తేదీన జరగబోవో బిట్టింగ్  మీరు పూర్తిగా వ్యతిరేకించాలి అని డిమాండ్ చేశారు .

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వండరాసి అప్పలరాజు, రాయపు చంద్రశేఖర్, Md. రఫీ, పొలమారు శెట్టి సీతారాం, అవగడ్డ అప్పలనాయుడు, బి.ఆర్. జోగినాయుడు,  ఎల్లపు శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

జనసేవ న్యూస్ రిపోర్టర్ :

సురేష్

అందరికి ఉపయోగ పడే పోస్ట్... కాబట్టి 
షేర్ చేయండి.