పెట్రోల్ రేటు పెరగడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేశారు


కాంగ్రెస్ నిరసన ర్యాలీ పెరిగిన పెట్రోల్,డీజిల్, నిత్యావసర ధరలు తగ్గించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు సైకిల్ ర్యాలీ చేసి నిరసన ధర్నా నిర్వహించారు.

GODAVARI NEWS 

ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ ఇంఛార్జ్ జమ్ము ఆదినారాయణ

మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టడం జరుగుతుందన్నారు.ఆకాశాన్ని ఎగబాకిని పెట్రోల్, డీజిల్,నిత్యవసరాలు ధరలను అదుపు చేయడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
కరోనా కష్టకాలంలో ప్రజలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే,పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వారికి పెనుభారంగా మారాయన్నారు.తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.


పెట్రోల్ రేటు పెరగడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది


 పీసీసీ ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు కాకినాడ  పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ పాండు రంగారావు మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం ఇష్టానుసారంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతూ ఉంటే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్యాస్ ధరలు కూడా అమాంతంగా పెంచడంపై వారు ధ్వజమెత్తారు ఒకపక్క దేశవ్యాప్తంగా కరోనా కారణంగా పేద మధ్య తరగతి ప్రజలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర వస్తువులను పెంచడం చాలా దారుణం అన్నారు.రాష్ట్రంలో అభివృద్ధి లేదని ప్రజలకు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దివాలా  తియ్యిస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ సిటీ ఇంచార్జ్ కోలా ప్రసాద్ వర్మ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి మల్లిపూడి రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రోజురోజుకీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుంటే ,మరో పక్క రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చి ప్రజల పై మరిన్ని మోయలేని భారాలు మోపుతుందని ధ్వజమెత్తారు..


 కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఆకుల వెంకటరమణ, వివిధ నియోజకవర్గాల ఇన్చార్జిలు  మేడిద శ్రీను ,ఎం శివ గణేష్ , యు వెంకట్రావు, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో లో పార్ట్ ఈ నాయకులు నేమామ్ పెదబాబు ,కంభం రాజబాబు ,చక్క నూకరాజు, కుక్కల పోతురాజుయాదవ్, పిట్ట అర్జున్ , తమ్మడపల్లి వాసు  పాండ్రంగి రమణమూర్తి,  అమ్మాజీ రావు, మాణిక్యాలరావు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


                                                                                                   జనసేవ  న్యూస్ రిపోర్టర్
                                                                                                         
                                                                                                         సురేష్