కోరాడ" ను విమర్శించే స్థాయి మీకు లేదు..

"కోరాడ" ను విమర్శించే స్థాయి మీకు లేదు..!
  ఆనందపురం : జనసేవ న్యూస్ 

 భీమిలి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కోరాడ రాజబాబును విమర్శించే స్థాయి మీకు లేదని వైకాపా నాయకులకు టిడిపి నాయకులు ఎదురు ప్రశ్న వేశారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు మాట్లాడారు. 
మండలానికి పరిమితమైన మీరు స్థాయి దిగజారి మాట్లాడటం సబబు కాదన్నారు. అన్నీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. కాపుల కోసం తెలుగుదేశం పార్టీ ఏ కచ్చితంగా పని చేసిందన్నారు.

 కార్పొరేషన్ పెట్టి మీ నాయకుడు జగన్ చేసింది ఏమిటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో కాపుల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి కాకుండా విజయసాయిరెడ్డికి విశాఖ పగ్గాలు ఎందుకు అప్పగించారని విమర్శించారు.

ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని అందరూ సమైక్యంగా ఉంటే స్థానికేతరడు ఎలా రాగలరని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
ఈ సమావేశంలో మండల టిడిపి అధ్యక్షుడు బొద్దెపు శ్రీను,విశాఖ పార్లమెంటరీ కార్య నిర్వాహక కార్యదర్శి 
మీసాల సత్యనారాయణ, 
నాయకులు షినగం రామకృష్ణ,
దొంతరల కనక రాజు,
షినగం వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.

 జీ. రవి కిషోర్ ( బ్యూరో చీఫ్ )