భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు : 

 ఆనందపురం : 

గురుపౌర్ణమి సందర్భంగా మండల శివారు వేమగొట్టిపాలెం సువర్ణభూమి లేఅవుట్ లో ఉన్న శ్రీ సువర్ణ షిరిడీ సాయి మందిరంలో  భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలను వైభవంగా జరిపారు. పౌర్ణమి పురస్కరించుకుని బాబాను దర్సించుకొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు మందిరానికి తరలిరావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున బాబాను పట్టువస్త్రాలు, పూలమాలలతో అలంకరించి  ఉదయం 6-గంటల నుంచి బాబావారికి కాగడా హారతి, పంచామృత అభిషేకం, సత్య సాయి వ్రతం, సాయి నామ సంకీర్తన, మధ్యాహ్న హారతి, అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.


 అనంతరం సాయంత్రం 6-గంటలకు సంధ్యహారతి, శ్రీ సాయి పల్లకి సేవా వంటి కార్యక్రమాలు నిర్వహించటం వలన ఆలయం అంతా సాయంత్రం వరకు సాయినామంతో మారుమోగింది.

రిపోర్టర్
సురేష్