వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి

వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి 

ఎ. ఓ. శివ కోమలి 

ఆనందపురం : జనసేవ న్యూస్ 

వెల్లంకి గ్రామపంచాయతీలో ఈరోజు రైతులతో జరిగిన మీటింగ్ లో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ శివ కోమలి , వెటర్నరీ డాక్టర్ కన్నప్ప నాయుడు  వెల్లంకి పంచాయతీ సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు.

ఉప సర్పంచ్ కంచరా పు శ్రీనివాసరావు, కాకర వెంకటరమణ, ఎంపీటీసీ అభ్యర్థి తోనంగిఅప్పారావు, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ సాడి రామారావు, వార్డు మెంబర్లు, సచివాలయం సిబ్బం వాలంటీర్స్, 200 మంది రైతులు పాల్గొన్నారు.




ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు రైతులకు పలు సూచనలు ఇచ్చారు ఉప సర్పంచ్ కంచరాపు శ్రీనివాసరావు మాట్లాడుతూ,

 రైతులకు వెల్లంకి గ్రామపంచాయతీలో సరైన రహదారులు లేకపోవడం వలన వా లు పండించే పంటలను రెండు కిలోమీటర్ల వరకు బస్తాలను మో సుకొని వెళ్ళవలసి వస్తుంది.

రైతులకు సరైన రహదారిని నిర్మిస్తే చాలా మంది రైతులు ఇంకా పంటలు పండించుకునే అవకాశం ఉంది కావున

ఈ విషయాన్ని మన వైఎస్ఆర్సిపి నాయకులు మంత్రిగారు అయిన అవంతి శ్రీనివాసరావు ఈ విషయాన్ని తెలియజేసి రైతులకి వీలైనంత త్వరగా రహదారులు నిర్మించిన వలసిందిగా రైతులు అందరూ కోరుకుంటున్నారు.

ఈ మీటింగ్ అనంతరం అక్షయపాత్ర ద్వారా రైతులందరికీ భోజనం సదుపాయం ఏర్పాటు చేసినందుకు అక్షయ పాత్ర వారికి రైతులందరూ సంతోషం తెలియజేశారు.