సంక్షేమం పేరుతో వైసిపి నాయకులు దోపిడి

సంక్షేమం పేరుతో వైసిపి నాయకులు దోపిడి : కోటిని బాలాజీ  

 అనకాపల్లి : సంక్షేమం పేరుతో వైసీపీ నాయకులు దోపిడి కి పాల్పడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటిని బాలాజీ ఆరోపించారు. బావులవాడ పంచాయతీ లో గల రావుగోపాలరావు కోలనిలో అనధికార లేఅవుట్ ను స్థానికులతో కలిసి పరిశీలించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఈ లేఅవుట్ సిద్ధం చేసి, 158 మందికి పట్టాలు కూడా పంపిణీ చేశారన్నారు. ఈ లేఅవుట్ లో ఇళ్లు నిర్మాణం జరిగితే సమీపంలో ఉన్న క్వారీ యజమానులు పరిస్థితి ప్రశ్నర్ధకం అవుతుందని, అందువలన క్వారీ యజమానులు స్థానిక వైసీపీ నాయకులతో కుమ్మకై,  ఈ ఇళ్ల నిర్మాణాన్ని వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇదంతా కాలనీకి సమీపంలో ఉన్న ఒక బడా  క్వారీ యజమాని కనుసన్నుల్లో జరుగుతుందని ఆరోపించారు. అయితే ఈ విషయం పై గ్రామస్తులు ఫిర్యాదుల రూపంలో  అధికారులు దృష్టికి తీసుకొని వెళ్లిన ఏ ఒక్కరు పట్టించుకోకపోవడం పై అనుమానలు వ్యక్తం చేశారు. తాజాగా హోసింగ్ జాయింట్ కలెక్టర్ లేఅవుట్ల ఏర్పాటుల పై అధికారుల పై ఆగ్రహించినప్పటకి, వారు తీరు మార్చుకోకపోవటం విడ్డురంగా ఉంది అన్నారు. అధికారులు సైతం అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరించటం దారుణం అన్నారు. ఇలాంటి చర్యల వలన అమాయకపు ప్రజలు బలైపోతున్నారని అన్నారు. ఇదే జరిగితే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కె. ఈశ్వరరావు, రత్నబాయి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Kotni Balaji TDPరిపోర్టర్ : సురేశ్
జన సేవ హెల్ప్ డెస్క్