తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు

*తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు* : 
  తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా షాద్ నగర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు బక్కన నర్సింహులని నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఉత్తర్వులు జారీచేశారు. 



బక్కన నర్సింహులు ఎన్.టి.రామారావు గారి మీద అభిమానంతో 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో నే ఉన్నారు.

 ఒక సామాన్య కార్యకర్త గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి శాసనసభ్యుడి గాను, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ లో సభ్యునిగా పనిచేశారు. 

ఎంతో మంది పార్టీలు మారిని, ఎన్నో బెదిరింపులు, ఆఫర్లు వచ్చిన ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీని నమ్ముకొని, నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన వ్యక్తిగా ఉన్నందుకు నేడు చంద్రబాబు నాయుడు ఆయన పై నమ్మకంతో అధ్యక్ష పదవిని అప్పగించారు.


జనసేవ న్యూస్ 
సురేశ్