చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి:


 భీమునిపట్నం : భీమిలి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులలో తిరిగి వస్తుండగా ఒకరు మృతి చెందారు. స్థానికులు మాట్లాడుతూ బుధవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో భీమిలి ఎగువ పేటకు చెందిన  పీరుపిల్లి రమేష్ తాలూకా పైబర్ తెప్పలో ఆరుగురు మత్స్యకారులు సముద్రంలోనికి వేటకి వెళ్లారు. అనంతరం
వేట ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో భీమిలి తీరప్రాంతంలో కెరటాలు
 ఉదృతంగా ఉండటం వలన ప్రమాదవశాత్తు కెరటాలలో
చిక్కుకొని ఫైబర్ తెప్ప బోర్లా తిరగబడి మునిగిపోవడం జరిగినది అని అన్నారు. ఈ ప్రమాదంలో మత్స్యకారులు పీరుపిల్లి రమేష్ , బర్రి రామారావు, గరికిన ఎల్లయ్య ,వాసుపల్లి కొండబాబు, పీరుపిల్లి నాగరాజు ,వాడుమొదల సత్య రావు, పీరుపిల్లి నర్సింగ్ రావు ఆరుగురు కూడా సముద్రంలోకి కొట్టుకుపోవడం జరిగింది. ఈ ఆరుగురిలో పీరుపిల్లి నర్సింగరావు (36 సం,,లు) s/o లేటు పెంటారావు  ఈదుకుంటూ ఒడ్డుకు వస్తుండగా కెరటాల తాకిడికి సముద్రంలో మునిగిపోయి చనిపోవడం జరిగిందని వాపోయారు. మిగిలిన ఐదుగురు కూడా సురక్షితంగా స్థానిక మత్స్యకారులు సహాయంతో తీరానికి చేరుకున్నారు. మునిగిపోయిన పీరుపిల్లి నర్సింగ్ రావుని  స్థానిక మత్స్యకారులు తీరానికి చేర్చి భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి  తీసుకుని వెళ్లారు, అప్పటికే చనిపోయినట్లు వైద్యాధికారులు చెప్పడం జరిగిందని అన్నారు .ఈ విషయంపై భీమిలి  పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగినదని చెప్పారు. 

రిపోర్టర్ : 
సురేష్