ఆనందపురం:జనసేవ న్యూస్
మండలంలోని వేములవలస లోగల డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మార్చాలని స్థానిక ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ విశాఖ జాయింట్ కలక్టర్ అరుణ్ బాబుకు విజ్ఞాపన పత్రం అందజేశారు.
అందుకు ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ వర్షం వస్తే హైవే వంతెన కింద నుంచి నీరు వచ్చి ఇళ్లలోకి వస్తుంది అన్నారు.
ఆ ప్రాంతమంతా చిత్తడి చిత్తడిగా మారుతుందని అన్నారు . వేములవలస సినిమా హాల్ వీధిలో గల ఇళ్లల్లోకి మొదలుకొని గ్రామంలో కూడా నీరు వచ్చి చెరువును తలపించే విధంగా ఉందన్నారు దీనికి తక్షణ పరిష్కార మార్గం చూపించాలని జెసి అరుణ్ బాబు తో పాటు నేషనల్ హైవే పి.డి.కి కూడా కో రాడ నవీన్ విజ్ఞప్తి చేశారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )