మంత్రి అవంతి పై అనుచిత వ్యాఖ్యలు తగదు

మంత్రి అవంతి పై అనుచిత వ్యాఖ్యలు తగదు 

ఆనందపురం: జనసేవ న్యూస్

భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు
కాపు సామాజికవర్గ నాయకులు 

బంక.సత్యం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల 
విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాశర్ల.ప్రశాద్ మరియు కొత్తగా పదవి పొందిన కోరాడ.రాజబాబు  కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో మాట్లాడటం జరిగింది వారి ఇరువురికి నేను తెలియపరిచేది ఏంటంటే నాడు దివంగత నేత

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాపు సోదరులకు ఉన్నతమైన పదవులు ఇచ్చిన విషయం మీకు గుర్తులేదా 

ఆ తరువాత వచ్చిన 

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు 

కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మహిళలకు కాపునేస్తం కింద ఆర్థిక సహాయం అందించడంలో రాష్ట్ర చరిత్రలో  సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని నాడు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఎటువంటి న్యాయం చెయ్యలేని 

అందుకే 2019 ఎలక్షన్స్ లో కాపు సోదరులు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పట్టంకట్టారని ఆ విషయం మీకు కనబడలేదా కొత్తగా పదవులు వచ్చాయని మీ అధిష్టానం మెప్పు కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని ఈ రోజు భీమిలి నియోజకవర్గంలో మంత్రి అవంతి శ్రీనివాస్ గారికి ఉన్నతమైన పదవి ఇస్తే ఆయన అభివ్రుద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు అసత్య ఆరోపణలు మానుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం   చెబుతారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆనందపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరాడ.వెంకటరావు గారు మరియు మజ్జి.వెంకటరావు తదితర నాయకులు పాల్గొన్నారు

జి. రవి కిషోర్. బ్యూరో చీఫ్

జనసేవ వార్తలు 
 దయచేసి ఈ పోస్ట్ అందరికీ పంచుకోండి