ఆనందపురం : జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాల వసతి గృహాలను వెంటనే పునఃప్రారంభించాలి అని తెలుగునాడు విద్యార్థి సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి లెంక సురేష్ డిమాండ్ చేశారు.
కోవిడ్ కారణంగా మూతపడిన డిగ్రీ , సాంకేతిక కళాశాలలను తెరిచి, ప్రభుత్వ కళాశాల ల వసతి గృహాలను తెరవకపోవడం పై ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ, సాంకేతిక కళాశాలలు తెరిచి దాదాపు నెల రోజులు గడుస్తున్నా సంబంధిత వసతి గృహాలను తెరవకపోవడం ప్రభుత్వానికి విద్యార్థుల మీద ఉన్న నిర్లక్ష్య ధోరణినికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు.
సంబంధిత వసతి గృహాలను తెరవకపోవడం వలన వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు కళాశాలలకు హాజరు కాలేకపోతున్నారని, తరగతులు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దీని వలన విద్యార్థులకు హాజరు శాతం కూడా బాగా తగ్గిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికే కరోన వలన వారి విధ్యబ్యాసం గందరగోళం లో ఉందని దీనికి తోడు ఇలాంటి సంఘటనల వలన హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఆందోళన గురవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి ప్రభుత్వ కళాశాలల వసతి గృహాలను వెంటనే పునః ప్రారంభించాలి అని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగునాడు విద్యార్థి సమైక్య నాయకులు కోరాడ వైకుంఠ రావు, కంది అప్పలరాజు, బొద్దపు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ :
సురేష్