వర్షాకాల వ్యాధుల పై అప్రమత్తత అవసరం...! ప్రజా వైద్యులు డాక్టర్ కుప్పిలి సురేష్ బాబు

వర్షాకాల వ్యాధుల పై అప్రమత్తత అవసరం...! ప్రజా వైద్యులు డాక్టర్ కుప్పిలి సురేష్ బాబు

విశాఖ : జనసేవ వార్తాలేఖ

 వర్షాకాలము పంటలు పండించడానికి అనువైన కాలము అలాగే మరొక వైపు దోమలు వైరస్ లు వృద్ధి చెందు టకు అనువైన కాలం ... దీని వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతిని నిత్యము ఏదో ఒక అంటువ్యాధి వస్తుందని ప్రజలలో ఆందోళన వచ్చింది .

 ఒక ప్రక్కన అంతుచిక్కని కరోనా వైరస్ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మరోపక్క సీజనల్ అంటువ్యాధుల రూపంలో డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరము, మలేరియా, చికెన్ గునియా, డయోరియా ,జీర్ణకోశ వ్యాధులు ,స్వైన్ ఫ్లూ, పచ్చకామెర్లు, మెదడువాపు జ్వరము, కలరా ,ఫ్లూ, జ్వరము ప్రజలను కలవరపెడుతున్నాయి.

 అందుకు ముఖ్యమైన కారణాలు ఏమనగా- కలుషిత ఆహారం , నీరు .గాలి స్వచ్ఛత లేకపోవడము ,వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత లోపించడం, రోడ్ల మీద బండ్లమీద అమ్మిన కలుషిత ఆహారం తినడం వలన ముందుజాగ్రత్త లేకపోవడం వలన ,ఈ వ్యాధుల వస్తాయి ..  సాధారణ ప్రజల కంటే బాలింతలకు వృద్ధులకు చిన్న పిల్లలకు మరింత ప్రమాదం ఎక్కువ .,సాధారణంగా పైన చెప్పిన వ్యాధులు వలన వచ్చే లక్షణాలు- జ్వరము, ఒళ్ళు నొప్పులు ,కీళ్ల నొప్పులు, తలనొప్పి, రొంప ,దగ్గు, ఆయాసం ,వాంతులు, విరోచనాలు, అలసట, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరము,  అలాగే ప్రతి వ్యాధిలో కొన్ని ప్రత్యేక లక్షణములు ఉంటాయి ఉదాహరణకు మలేరియా లో చలి జ్వరం వస్తుంది ,కామెర్ల రోగం లో కళ్ళు శరీరము మూత్రము పసుపు రంగులో ఉంటాయి చికెన్ గునియా లో తీవ్రమైన కీళ్లనొప్పులు ఉండడము జరుగుతుంది.

 సార్వజనిక ఆరోగ్యం కోసం వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలి -అవి ఏవనగా- వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత అత్యవసరము నీరు నిల్వ లేకుండా చూడాలి ..  పైన చెప్పిన అన్ని జాగ్రత్తలతో పాటు కోవిడ్ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి .

మూతికి ముక్కుకి మాస్క్ పెట్టుకోవాలి, పదేపదే చేతులను సబ్బుతో కడుక్కోవాలి ,సామాజిక దూరము ఖచ్చితంగా పాటించాలి, మస్కిటో రీ పిల్లర్ ఎట్ వాడాలి, తుమ్మిన దగ్గినా చేతిరుమాలు అడ్డు పెట్టుకోవాలి ,ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి, ఈగలు దోమలు వాలిన ఆహారపదార్ధములు తినరాదు, వేడి వేడి ఆహార పదార్థాలు తినాలి,  సాధారణంగా మరిగించిన నీటిని తాగడం మంచిది. 


పై వ్యాధులతో పాటు కోవిడ్ లక్షణములు కలసి పోవడం వలన పై లక్షణములు ఏవైనా ఉంటే వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకొని అశ్రద్ధ చేయకుండా ప్రారంభదశలోనే వైద్యుల్ని  సంప్రదించి ప్రాణహాని నుంచి బయట పడవచ్చు ..సార్వజనిక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలి  అని తెలియజేశారు ...పై విధంగా డాక్టర్ సురేష్ బాబు అంటువ్యాధుల పై మాట్లాడుతూ తన వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు

జనసేవ రిపోర్టర్

 రవి కిషోర్