మంత్రి గార్కి బీచ్ లు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా

మంత్రి గార్కి బీచ్ లు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా : 

జనసేవ వార్తలు

కోరాడ  ఎప్పుడు లేనిది ఈ రోజు మంత్రి గార్కి కొత్తగా బీచ్ ల అభివృద్ధి గుర్తుకువచ్చింద అని తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జి కోరాడ రాజబాబు అన్నారు. 

ఈయన శనివారం తన నివాసం లో విలేకర్లతో మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ రావు గారు నిన్న సమావేశంలో 10 బీచ్ లను అభివృద్ధి చేస్తాను.

అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని, గత రెండు సంవత్సరాలుగా లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారో ఆయన చెప్పాలి అని, ఇదంతా కేవలం భీమిలి నుంచి భోగాపురం వరకు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రోడ్డు కోసం గతంలో స్థానికంగా వ్యతిరేకత వచ్చిందని దానిని నుంచి ప్రజల దృష్టి మాలచటానికి ఆయన చేస్తున్న ప్రయత్నం అని ఆయన విమర్శించారు. 

మీకు నిజం గా పర్యాటకం పై ప్రేమ ఉంటే ముందు  సాగర్ నగర్ నుండి భీమిలి వరకు గల మధ్యలో ఉన్న ఏడు బీచ్ లను అభివృద్ధి చేసి చూపాలి అని విమర్శించారు. అంతేగాని మీ రాజకీయ లబ్ది కోసం నాగమయ్య పాలెం, అన్నవరం, కంచెరుపాలెం గ్రామాల బీచ్ ల అభివృద్ధి పేరు చెప్పి  ప్రజా వ్యతిరేకమైన రోడ్లు ని నిర్మించి ప్రజలను మోసం చేయడం తగదు అని, ఈ రోడ్డు నిర్మాణం వలన ఆ ప్రాంతం లో గల పేద, మధ్యతరగతి కుటుంబీకుల ఇల్లులు,  రైతు ల వ్యవసాయ భూములను నష్టపోతున్నారని 



ఈ రోడ్డు నిర్మాణం వలన భూ స్వాములకు, పార్టీ నాయకులకు లాభదాయకంగా ఉందని కాబట్టి ఈ అలైన్మెంటు ను   పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా, రైతులకు కష్టం కలగకుండా,  అన్ని వర్గాల ప్రజల ఆమోదంతో మార్చలని అలా కాకుంటే పేద ప్రజలకు, రైతులకు అండగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ రాజబాబు హెచ్చరించారు.


                                                                                                                                రిపోర్టర్

                                                                                                                                  సురేష్