దేశంలోను రాష్ట్రంలోను గ్యాస్,పెట్రోల్,డీజిల్, నిత్యావసర సరుకులు ధరలు పెంపు

దేశంలోను రాష్ట్రంలోను  గ్యాస్,పెట్రోల్,డీజిల్, నిత్యావసర సరుకులు ధరలు పెంపు మరియు ఇంటి పన్నులు పెంపును నిరసిస్తు AICC మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాలమేరకు 

చీపురుపల్లి నియోజకవర్గo :
కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు ఐ సూర్యనారాయణ  గారి అధ్వర్యంలో స్థానిక  నిరసన ర్యాలీ నిర్వహిస్తు  రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి స్థానిక పెట్రోల్ బ్యాంకులో వాహనదారుల నుండి సంతకాలు సేకరించి రాష్ట్ర ,జిల్లా,నియోజకవర్గ నాయకులు ప్రసంగించి నిరసన తెలియజేశారు, పెంచిన ధరలకు వ్యతిరేకంగా ప్రజల నుండి సేకరించిన సంతకముల ప్రతులను రాష్ట్ర కార్యాలయంకి పంపించారు.

దేశంలోను రాష్ట్రంలోను  గ్యాస్,పెట్రోల్,డీజిల్, నిత్యావసర సరుకులు ధరలు పెంపు
దేశంలోను రాష్ట్రంలోను  గ్యాస్,పెట్రోల్,డీజిల్, నిత్యావసర సరుకులు ధరలు పెంపు


ఈ కార్యక్రమంలో,ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జమ్ము ఆదినారాయణ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకులు ధరలు మరియు చెత్త పన్ను  వెంటనే తాగించాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 

ఈకార్యక్రమంలో డీసీసీ మెంబెర్ ఎన్ పైడిరాజు తోపాటు గుర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పతివాడ గోవింద్, మీసాల వైకుంఠం, చిట్టి రామారావు, జగన్,సూర్యనారాయణ, శ్రీను,రాజు మరియు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.