మధురవాడ హైవే రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం

మధురవాడ హైవే రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం

జనసేవ న్యూస్

మధురవాడ లో డీమార్ట్ సమీపంలో హైవే రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.డీమార్ట్ లో వస్తువులు కొనుక్కొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న భారీ వాహనం ఢీ కొట్టడం తో మూడు సంవత్సరాల వయస్సు గల చిన్నారి గ్రంధి జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు భారీ వాహనాన్ని, నిందితుడని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

రిపోర్టర్

సురేష్