ఈ నెల 19న ముఖ్యమంత్రి జనన్నను కలుస్తాం

ఈ నెల 19న ముఖ్యమంత్రి జనన్నను కలుస్తాం : లెంక సురేష్


 ఆనందపురం : నూతన జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 19న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సీఎం క్యాంప్ కార్యాలయంలో కలవనున్నట్లు తెలుగునాడు విద్యార్థి సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి లెంక సురేష్ అన్నారు. సొంట్యం లో  విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది జాబ్ క్యాలండర్ కాదు అని జాదు క్యాలండర్ అని ఎద్దేవా చేశారు. పోలీసు ఉద్యోగాలు 6500 తీస్తామని పదేపదే ప్రకటనలు చేసి ఇప్పుడు సచివాలయం పోలీసులతో సరిపెట్టడం అన్యాయం అని, డిఎస్సి ఊసే లేదు అని, వేల సంఖ్యలో కావలసిన గ్రూప్-1,2 ఉద్యోగాలను

ఈ నెల 19న ముఖ్యమంత్రి జనన్నను కలుస్తాం

 పై గత కొన్ని రోజుల నుండి నిరసనలు చేస్తున్నప్పటికీ కుదించేసి యువతను నిరాశ పరిచారు అని విమర్శించారు. దీని పై గత కొన్ని రోజుల నుండి రాష్ట్ర లో యువత నిరసనలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు అని అన్నారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలోనూ, ఎన్నికల సందర్భంలోనూ, ముఖ్యమంత్రి గా అసెంబ్లీలో జగన్ చెప్పిన మాటలను ఆయనను ఇతర విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలతో సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిసి గుర్తుచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర లో గల యువత, నిరుద్యోగులు కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జనసేవ వార్తలు రిపోర్టర్

సురేష్ఈ వర్షకాలం అందరికి ఉపయోగ పడే పోస్ట్... కాబట్టి 
షేర్ చేయండి.        🙏