టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు పంపిణీ

 *ఆనందపురం* : పెందుర్తి - ఆనందపురం ప్రధాన రహదారి లో గల నిరాశ్రయులకు, మతిస్థిమితం లేనివారికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మానవత్వం తో సేవలు అందించారు.
 శుక్రవారం టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు పంపిణీ చేసి, వారి ఆకలి తీర్చారు. 

ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు లెంక సురేష్ మాట్లాడుతూ అన్ని దానాలు కన్నా అన్నదానం మిన్న అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం వలన మనస్సు చాలా సంతృప్తి గా ఉంటుందని అన్నారు. 

 ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యలు బూర్లు శ్రీను, నాగిశెట్టి పృథ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.