జీవీఎంసీ 28వవార్డులో వార్డు ఇంచార్జ్ శ్రీ పల్లా దుర్గారావు మార్నింగ్ వాక్ లో భాగంగా నెహ్రూనగర్ ప్రాంతంలో పర్యటించారు

 ఈ యొక్క పర్యటనలో భాగంగా నెహ్రూనగర్ EWS క్వార్టర్స్ అసోసియేషన్ వారు చెత్త పన్నును మా ఏరియా బీలో ప్రోవేర్టీ లైన్ లో ఉంది అందువల్ల చెత్త పన్ను 120రూ నుంచి 60 రూ చేయవలవలసిందిగా 
  28వవార్డు కార్పొరేటర్ శ్రీమతి పల్లా అప్పలకొండ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ విషయం పై స్పందించిన పల్లా దుర్గారావు ఆ యొక్క చెత్త పన్ను విషయం పై జీవీఎంసీ కమిషనర్ తో మాటలాడి 120రూ ఉన్న పన్నును 60రూ చేయవలసిందిగా కోరుతాను. నేను ఒక 15రోజుల వ్యవధిలో మీ యొక్క సమస్యను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు.
 అదే విధముగా మరి కొన్ని సమస్యలును కూడా నెహ్రూనగర్ అసోసియేషన్ వారు తెలియజేయాగా వాటిని కూడా వెంటనే పరిష్కరిస్దాను అని చెప్పగా అక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
 అదే అదేవిధంగా పంది మెట్ట ప్రాంతంలో డ్రైనుకి సంబంధిత సమస్య ఉందని అక్కడున్న ప్రజలు మరియు పెద్దలు ఆ సమస్యను దుర్గా రావు తెలియజేయగా ఆ యొక్క ప్రాంతంలో జీవీఎంసీ వారు కడుతున్న డ్రైనును పరిశీలించి అక్కడ ప్రక్కన ఉన్న డ్రైను కూడా పాడైపోతుంది అని AE చెప్పడం జరిగింది. 

AE వెంటనే స్పందించి వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ లో ఇలాంటి మరమ్మతులు అని చేయిస్తాము అని హామీ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో వార్డ్ సీనియర్ నాయకులు రాపాక శ్రీనివాసరావు ,సంపంగి సురేష్ , కొల చిన్న ,పల్లా కృష్ణ ,నెహ్రునగర్ అసోసియేషన్ సభ్యులు భూసార విగ్గు . ఠాగూర్ సత్య .కృష్ణ తదితర పెద్దలు పాల్గొన్నారు.