ఫిబ్రవరి 20వ తేదీన నరసాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగే మత్స్యకార అభ్యున్నతి మహా సభను జయప్రదం చెయ్యాలని జనసేన పార్టీ మత్స్యకారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మూగి శ్రీనివాసరావు,
భీమిలి నియోజకవర్గ జనసేన అన్ని ఇంచార్జ్ డా.పంచకర్ల నాగ సందీప్ కోరారు. భీమిలి నియోజకవర్గం మత్స్యకార గ్రామాలైన అన్నవరం, పెద నాగమయ్య పాలెం, చేపలు ప్పా డ, మంగ మారి పేట, భీమిలి ఎగువ పేట, బోయ వీధి, తోట వీధి గ్రామాల్లో జనసేన శ్రేణులు తో కలిసి గురువారం మహా పాదయాత్ర చేశారు. అన్నవరం లో ఉదయం ఎనిమిది కి ప్రారంభమైన పాదయాత్ర సుమారు 15 కిమి మేర సాగి భీమిలి లో రాత్రి ఎనిమిది గంటలకు ముగిసింది.
*పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మత్స్యకారుల బతుకులు బాగుపడతాయి*
*పాదయాత్ర లో భాగంగా ఇంటింటికి వెళ్లి జనసేన అభ్యర్థి చేసే పనులు వివరిస్తూ కరపత్రాలు పంచి పెట్టారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన సామాజిక వర్గంగా ఉన్న మత్స్యకారులను అన్ని విధాలుగా పైకి తెస్తామన్నారు.
స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా మత్స్యకారులు బతుకుల్లో వెలుగు లేకపోవడానికి పాలకులే కారణమని ద్వజమెత్తారు.
మత్స్యకారులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే జనసేన కు పట్టం కట్టాలన్నారు. నరసాపురం లో జరిగే సభకు ప్రతి మగాడు తప్పక హాజరై మత్స్యకారుల అభ్యున్నతికి జనసేన రూపొందించే కార్యాచరణలో భాగస్వాములు కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నేత లు పరిమి భువనేశ్వరి, వందలాది మంది జనసేన నాయకులు, పార్టీ మత్స్యకార విభాగం నాయకులు ఉమ్మడి మొగ్గ య్య, మైలపల్లి అనిల్, వాసు పల్లి అనిల్, Garikina అప్పారావు, ఉమ్మడి రాజు, పాల్గొన్నారు*