శభాష్ ''జ్ఞానేశ్వర్''..

ఆనందపురం:జయ జయ హే
      మండలంలోని వేములవలస పంచాయితీ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడకు వచ్చిన సందర్భంగా అధికారులతో అడిగి తెలుసుకున్నారు. 

     ఇందులో స్థానిక పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. రాజకీయాలు, పదవికి కొత్తవాడైనప్పటికీ   నవీన్ జ్ఞానేశ్వర్ ఉత్తేజంగా పనిచేయడం పై భుజం తట్టి అభినందించారు. 
  
 విద్యావంతుడు, యువకుడైన కోరాడ నవీన్  జ్ఞానేశ్వర్ ను ప్రస్తుత యువత ఆదర్శంగా తీసుకోవాలి అని కొనియాడారు.

    తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్న జ్ఞానేశ్వర్ కు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్ ఉందని మంత్రి బొత్స  అభిలషించారు.