ముకుందపురంలో భారీ అన్నదానం.....! ప్రారంభించిన కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్

జనసేవ న్యూస్ :ఆనందపురం
 మండలంలోని ముకుందపురం గ్రామంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని వేములవలస ఉప సర్పంచ్, 
టిడిపి యువ నాయకుడు కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తన తండ్రి భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు విరాళంగా ఇచ్చిన నిధులతో కార్యక్రమం జరిగిందన్నారు. 

అన్ని దానాల కంటే అన్నదానం మహాగొప్పదని అన్నార్తులకు ఆహారం అందించడం పూర్వజన్మ సుకృతమని అభివర్ణించారు.  స్థానిక సర్పంచ్ కలిమి గంగరాజు పంచాయతీ అభివృద్ధికి చేస్తున్న కృషిని కొనియాడారు.

అతనికి ప్రజల ఆదరాభిమానాలు సంపూర్ణంగా ఉన్నాయని ఇక్కడకు వచ్చిన ప్రజలను చూస్తే తెలుస్తుంది అని ప్రశంసించారు. 

ఈ కార్యక్రమంలో నవీన్ యువసేన నాయకులు ఎర్రాజీ స్వామి నాయుడు, నడిమింటి అప్పలరాజు,  కోరాడ గణేష్ , కోరాడ మహేష్ , కోరాడ రమణ తదితరులు పాల్గొని సహాయ సహకారాలు అందించారు. సుమారు 5000మంది అన్నదానం స్వీకరించారు.