భక్తులతో కిటకిటలాడిన బైరావవాక

 *సింహాచలం* : మంగళవారం అమావాస్య కావడంతో బైరావవాక భక్తులతో కిటకిటలాడింది. సింహాచలం శివారు ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం లో పచ్చని చెట్లు నడుమ, కొండల మధ్యన కొలువైన సింహాచలం పాలకుడి గా పేరు గాంచిన బైరావ స్వామి ని ప్రతీ నెలా అమావాస్య రోజున దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది.

 మంగళవారం తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో బారులు తీరారు. అమావాస్య రోజున స్వామి ని దర్శనం చేసుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. 

కోవిడ్ నిబంధనలు మేరకు మాస్క్ లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు. వేలాది గా తరలివచ్చిన భక్తులతో సింహాచలం వద్ద గల బైరావవాక స్వామి ఆలయం వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. 

మరోవైపు ఎలాంటి సమస్యలు లేకుండా దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేశారు, అయినప్పటికీ ఆలయం వద్దకు వెళ్ళే రోడ్డు చిన్న మట్టి రోడ్డు ఉండటం వలన భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. 

దీంతో కొంత మంది భక్తులు రోడ్డు వెడల్పు చేసి, సరైన రోడ్డు నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.