జనసేవ అమరావతి* :
కరోన థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల పై కీలక ప్రకటన చేసింది.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమలపు సురేష్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు మార్చి లోనే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రతి స్కూల్‌లో 95 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు.
విద్యా సంవత్సరం ప్రారంభంలో అమ్మ ఒడి మూడో విడత ఇస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
నిబంధనలు పాటించని బీఈడీ, డీఈడీ, 375 కాలేజీలు మూతపడ్డాయని మంత్రి చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీలో చట్టసవరణ ద్వారా 35 శాతం ఫ్రీ సీట్లు ఇచ్చామని..
అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లన్నారు. ఏ విద్యార్థి డబ్బులు లేక విద్యకు దూరం కాకూడదని.. అమ్మ ఒడి ఇచ్చి విద్యార్థులకు యూనిఫాం, బుక్స్‌తో పాటు మధ్యాహ్న పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు.