పి ఆర్ సి అమలు లో ఉద్యోగులకు నష్టం 62 ఏళ్ల వయోపరిమితి పెంచడంతో రేపు మాపోరిటైర్ కాబోతున్న వారికి లాభం .ఇది నేతలతాకట్టు వ్యవహారమే అంటున్న నిరుద్యోగులు


-------------
పి ఆర్ సి ముసుగులో ఉద్యోగులకు నష్టం, నేతలకు లాభం. 

ప్రభుత్వ వ్యూహానికి ఉద్యోగులు బలి. 

 బొప్పరాజు, బండి ల స్వార్థం నిరుద్యోగ పెరుగుదలకు తార్కాణం. 

బకాయి వున్న డి ఏ నే పెరిగిన జీతాలు అనటం అన్యాయం. 

62 ఏళ్ల పెంపు వెనుక ఉద్దేశం  రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులు దారి మళ్లించటానికేనా  !
-------------
మేడా శ్రీనివాస్, ఆక్షేపణ, 
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ 
-------------
ఉద్యోగ సంఘ నేతలు ఎందు కోసం ఉద్యోగుల భవిష్యత్తు ను నాశనం చేసారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు .

గత కొన్నాళ్ళు గా 
ఉద్యోగులకు ప్రభుత్వం పి ఆర్ సి వస్తుందని, ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఎదురు చూపులు చూసేవారని,ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రణాళికలో ఉద్యోగుల ఆశలన్ని అడి ఆశలయ్యాయని, ప్రస్తుతం అమలు చేసిన పిఆర్సి విధానం  ఉద్యోగుల జేబు కొట్టి ఉద్యోగులకే పంచినట్టు వుందని,హెచ్ ఆర్ ఏ  స్లాబ్ లో ఏ విధమైన పెరుగుదల మార్పు లేకుండా ఉద్యోగులకు మేలు జరిగిందని ప్రకటించు కోవటం సిగ్గుమాలిన చర్యగా భావించాలని, ఈ నెల వచ్చే ప్లే స్లిప్, గత నేల ప్లే స్లిప్ గమనిస్తే ఉద్యోగులకు జరిగిన మోసం అర్థమైతుందని, పిఆర్సి అమల్లో కొత్త వెలుగులు రాకపోగా పాత రాయితీలు, నేటి వరకు పడిన శ్రమ పిఆర్సి చర్చల ముసుగులో దోచుకున్నారని, ఉద్యోగ సంఘ నేతలు సైతం కొన్ని బలహీనతలకు ఉద్యోగుల తలలను తాకట్టు పెట్టినట్టు ఆరోపణలు ఎదురైతున్నాయని, నేతల స్వార్ధం ఉద్యోగుల జీవితాలను నాశనం చేశాయని, గతంలో పిఆర్సి కమిషన్  అమలు చేయమని ఇచ్చిన నివేదికను ప్రక్కన పెట్టి 27% గా  ఐ ర్ గా అమలు జరిగిందని ,కొత్తగా  పిఆర్సి అమలు చేసే విధానం ఏమిటంటే అమలు జరుగుతున్న ఐ ఆర్ పై  ఎంతో కొంత పెంచి పిఆర్సి అమలు చేయటం న్యాయమైన విధానం అని, ఇప్పుడు ప్రకటించిన పిఆర్సి ఉద్యోగులు జీతాలు పెరిగినట్టా ! వారి జేబుకు కన్నం వేసి వారికే ఇస్తున్నట్టా అనేది ఉద్యోగుల మేధస్సుకు అంతుపట్టడం లేదని, పక్క రాష్ట్రాల్లో పిఆర్సి అమలు జరిగిన విధానం ఏమిటంటే అమలు జరుగుతున్న ఐ ఆర్ (ఇంటెర్మ్ రిలీఫ్ ) కు అధనంగా పెంచి అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేసారు .

ప్రభుత్వ వ్యూహంలో ఏపి ఉద్యోగులు బలి పశువులుగా మారారా  ! పిఆర్సి అమలు చర్చల పేరుతొ ఉద్యోగులను బురిడి కొట్టించారని, ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగులు కంటిని పొడిపించారని, పిఆర్సి కమిషన్ నివేదికను భహిర్గత పరచకుండా ఫిట్మెంట్ అమలు చేయటం ఆశ్చర్యంగా వుందని, ఇంత మోసపూరిత పిఆర్సి అమలుకు బొప్పరాజు, బండి చప్పట్లు కొట్టటం వెనుక పలు అనుమానాలు వస్తున్నాయని, చప్పట్లు కొట్టి బయటకు వచ్చిన అనంతరం 
హెచ్ ఆర్ ఏ విషయంలో న్యాయం చేయాలని కోరటం మరింత అనుమానాలకు తావు నిస్తుందని, ఉద్యోగులకు బకాయి వున్న డి ఏ లను నగదు రూపంలో చెల్లించాల్సి వుండగా బకాయి వున్న డి ఏ లను కలిపి పిఆర్సి ఫిట్మెంట్ అమలు చేయటం మోసం కాదా అని, ఈ తరహా పిఆర్సి అమలు కారణంగా ప్రతి ఉద్యోగి తన సర్వీస్ కాలంలో సుమారు 4 లక్షలు పై బడి నష్టపోతారని, గతంలో ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తాం అని ఒగ్దానం చేసిన ముఖ్యమంత్రి కి ఆ విషయం నేతలు కనీసం గుర్తు చేయకపోవడం ఆశ్చర్యం గా వుందని ఆయన వాపోయారు. 

ఉద్యోగులకు వయో పరిమితి 62 సంవత్సరాలు కు పెంచటం కారణంగా మరో కొద్ది నెలల్లో రిటైర్ కాబోతున్న  బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు లకు భారిగా  మేలు జరిగిందని, తద్వారా ఏపిలో భారిగా నిరుద్యోగులు పెరిగిపోతారని, నేతలకు మేలు చేయటం కోసం పట్టభద్రులకు ద్రోహం చేసారని, గ్రామాల్లో తల్లి దండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని బిడ్డలను చదివించటం కోసం పట్టణాలకు పంపి  ప్రభుత్వ ఉద్యోగాలకై ఖరీదైన కోచింగ్ లు ఇప్పిస్తున్నారని, ఉద్యోగులకు 62 సంవత్సరాలు వయస్సు పెంచటం కారణంగా ఏటా లక్షల్లో నిరుద్యోగులు పెరిగే ప్రమాదం వుందని, ప్రస్తుతం ప్రకటించిన అన్యాయ మైన పిఆర్సి ఫిట్మెంట్ కారణంగా జీతాలు సరిపడక ఉద్యోగుల్లో లంచగొండి తనం పెరిగి పోతుందని, కొత్త పిఆర్సి అమలు జరిగితే ప్రతి ఉద్యోగి సర్వీస్ మొత్తంలో ఒక ఇంక్రిమెంట్ నష్ట పోవాల్సి వస్తుందని, డి ఏ లు ప్రతి ఉద్యోగి హక్కు అని, ప్రస్తుతం ఫిట్మెంట్ తగ్గించి రావలసిన డి ఏ లు కలిపి జీతాలు పెరిగి నట్టు కాకిలెక్కలు చెప్పటం, బొప్పరాజు, బండి గొప్ప పిఆర్సి అని చెప్పటం వెనుక పెద్ద మోసమే జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేసారు. 

గత ఉమ్మడి రాష్ట్రంలో పని చేసిన ఉద్యోగుల జీతాలతో పోల్చుకుంటే ప్రస్తుత పిఆర్సి ఘోరమైన నష్టం అని, 2013 పిఆర్సి ప్రయోజనాలు అమలు చేస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుందని కొంతమంది ఉద్యోగులు భావిస్తున్నారని, మూల వేతనం పెంచకుండ పాతబకాయిలు కలిపి జీతాలు పెంచమనటం పచ్చి మోసం అని, రాష్ట్ర ప్రభుత్వం తో పిఆర్సి చర్చల్లో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు రాజీనామాలను ఏపి ఉద్యోగులు కోరుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు.

సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. 

ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ ఎవిఎల్ నరసింహారావు ,  డివిఆర్ మూర్తి, లంక దుర్గా ప్రసాద్ , ఎండి హుస్సేన్, ఆర్ కే చెట్టి, దుడ్డె త్రినాద్ ,  వల్లి శ్రీనివాసరావు, దుడ్డె సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , సిమ్మా దుర్గారావు , దోషి నిషాంత్ , ముదపాక రామకృష్ణ , పిల్లాడి ఆంజనేయులు , వాడపల్లి జ్యోతిష్ ,   మాసా అప్పాయమ్మ , కొల్లి సిమ్మన్న , పిల్లా గణేష్ రెడ్డి , 
పి. ప్రసాద్  తదితరులు పాల్గొని యున్నారు. 


--మేడా శ్రీనివాస్, 
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్