చందకలో నీటి సమస్యకు పరిష్కారం

చందకలో నీటి సమస్యకు పరిష్కారం
 ఆనందపురం జనసేవ న్యూస్ 
 మండలంలోని చందక పంచాయితీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కలిగింది. స్థానిక సర్పంచ్ బంక శ్రీనివాసరావు చొరవతో సమస్య జటిలం కాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. 

ప్రాధాన్యత క్రమంలో ఆ గ్రామంలో నీటి సమస్య ను ఎంచుకున్నారు. తక్షణమే సోమవారం గొట్టపు బావి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా బంక శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సుమారు లక్ష 50వేల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.

జి.రవి కిషోర్ (బ్యూరో చీఫ్)