చందకలో పండగగా పంద్రాగస్ట్

చందకలో పండగగా పంద్రాగస్ట్
ఆనందపురం :జనసేవ న్యూస్
 మండలంలోని చందకలో స్థానిక సర్పంచ్ బంక శ్రీను పంచాయతీ కార్యాలయం వద్ద పతాకావిష్కరణ జరిపి మాట్లాడారు. 
కులమతాలకు తావులేకుండా అందరూ సమైక్యంగా ఉండాలి అన్నారు. ముఖ్యంగా యువత సానుకూల ఆలోచనలతో లక్ష్యాలను ఛేదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంక శ్రీనుతో పాటు వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు బంక సత్యం, మాజీ సర్పంచ్ రెడ్డి సీతయ్య, లోలుగు రాజు, మతికాన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )