ఆనందపురం జనసేన న్యూస్
మండలంలోని లొడగల వాని పాలెం పంచాయతీ సర్పంచ్ లొడగల రాజేశ్వరి, ఆమె భర్త మాజీ సర్పంచ్ లొడగల రమణ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి శ్రీనివాస్ రావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గతంలో టీడీపీలో ఉన్న వీరు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సీఎం జగన్ చేస్తున్న ప్రజారంజక పాలన కు ఆకర్షించి ప్రజల కూడా అటు వైపే మొగ్గు చూపడంతో వారి బాట పట్టి వైకాపాలో చేరినట్లు స్పష్టం చేశారు.
జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )