మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ జూ. ఎన్టీఆర్ అభిమానులు ప్రత్యేక పూజలు

* జనసేవ పత్రికా* : 
 *ద్వారాకతిరుమల* : జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా నటిస్తున్న మీలో ఎవరు కోటేశ్వరులు కార్యక్రమం ఆదివారం రాత్రి 08:30 గంటలకు ప్రచారం కాబోతున్న సందర్భంగా విజయవంతం కావాలని కోరుతూ ఏలూరు పట్టణ అభిమానులు, టీం తారక్ ట్రస్ట్ సభ్యులు ఆధ్వర్యంలో ద్వారకాతిరుమలలో గల వెంకటేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అభిమానులు సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీ చావ్వకుల శ్రీనివాస్ రావు పాల్గొని ప్రమోషన్ బండిని రిబ్బన్ కటింగ్ చేసి ద్వారకతిరుమల నుంచి ప్రారంభించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మీలో ఎవరు కోటేశ్వరులు కార్యక్రమం సోమవారం నుండి గురువారం వరకు ప్రతీ రోజు రాత్రి 08:30 వరకు జెమిని టీవీ లో ప్రచారం జరగబోతుంది అని, 
ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించి విజయవంతం చేయాలని అన్నారు. తిరుమల వెంకన్న ఆయనకు నిండు నూరేళ్లు అన్ని వేళలా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో దీవించాలని కోరారు.

 ప్రమోషన్ బండిలో ఎర్పాటు చేసిన మీలో ఎవరు కోటేశ్వరులు సెట్ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీం తారక్ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ బలుసు సాయి తారక్, పట్టణ అభిమాన సంఘ నాయకులు గోవర్ధన్, రమేష్, ప్రసాద్, మోహన్, రంగా మరియు మరికొంత మంది అభిమానులు పాల్గొన్నారు.

Reporter
సురేశ్