ఈత కోసం వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

ఆనందపురం :జనసేవా న్యూస్
 మండలంలోని గిడిజాల లో గల ఒక కళాశాలలో ఇంజనీరింగ్ చేస్తున్న ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. 
వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖకు చెందిన కట్టమూరి వెంకట సాయి పవన్(17) హర్ష శ్రీ సంతోష్(17)లు ఆటవిడుపుగా తమ స్నేహితులతో గిరిజాల సరుగుడు తోటలో గల ఒక నేల బావిలో సరదాగా ఈత కోసం వెళ్లారు. 
 వీరు ఆ క్రమంలో బయటకు రావడానికి అవకాశం లేకుండా పోవడంతో విగతజీవులుగా మారారు. 
మిగతా విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని రక్షించే చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం కానరలేదు. కుటుంబ సభ్యులు తమ పిల్లలు మరణించడం పట్ల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 
అందిన ఫిర్యాదు మేరకు ఆనందపురం సి ఐ వై రవి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతుంది.

(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )