హెపటైటిస్ డే పై అవగాహన - డాక్టరు కుప్పిలి సురేష్ బాబు సూచనలు సలహాలు

హెపటైటిస్ డే పై అవగాహన - డాక్టరు కుప్పిలి సురేష్ బాబు సూచనలు సలహాలు*  

ఆనందపురం: జనసేవ  న్యూస్ 

ప్రపంచ హెపటైటిస్ డే దినోత్సవాల్లో భాగంగా జరిగిన అవగాహన శిబిరం లో ప్రజా వైద్యులు డాక్టరు కుప్పిలి సురేష్ బాబు మాట్లాడుతూ
Dr.Kapili suresh Babu
ప్రపంచాన్నిభయకంపితులను చేస్తున్న హెపటైటిస్ వ్యాధి  అనేది ఒకటి ...ఇది కాలేయానికి వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి . పలురకాలుగా అనగా హెపటైటిస్ వ్యాధి ఇది క్రమక్రమంగా కాలేయాన్ని నాశనం చేస్తుంది . ఇది పలు రకాలుగా అనగా ఏ బి సి డి ఈ ఉంటుంది .
 దీనికి చికిత్స కంటే నివారణ అతి ముఖ్యము . హెపటైటిస్ డే ప్రధాన ఉద్దేశ్యము ప్రజల్లో అవగాహన కలిగించడం అనగా వ్యాధి లక్షణాలు వ్యాప్తి నివారణ జాగ్రత్తలు  2030 ఒక సంవత్సరం కల్లా  హెపటైటిస్ వ్యాధిని పూర్తిగా నివారించడం టార్గెట్ గా ఈ రోజును .హెపటైటిస్ డే గా జరుపుకుంటారు . ఈ వ్యాధిగ్రస్తులు ప్రతి 30 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారు . దానిని అరికట్టే విధంగా 2021 వ సంవత్సరము  టార్గెట్ ను రూపొందించారు . ఇది ఎలా వ్యాపిస్తుంది అంటే -కలుషిత నీరు ఆహారం ద్వారా రక్త మార్పిడి ద్వారా లైంగిక చర్యల ద్వారా కొన్ని ఇతర స్రావాల ద్వారా వాడిన సిరంజీలు వాడిన సిరంజీలు మరల మరల వాడడం వలన మితిమీరిన మద్యం పొగ త్రాగడం వలన కొన్ని మందుల వలన  సంక్రమిస్తుంది వ్యాధి లక్షణాలు- ఏవనగా శరీరము  కళ్ళు, మూత్రము పచ్చగా మారడం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు, విరోచనాలు, . మొ వి    వ్యాధి నివారణ ఎలా గనగా  - వ్యక్తిగత ,పరిసరాల పరిశుభ్రత ,మరిగించిన మంచినీరు తాగాలి, రక్తమార్పిడి లో రక్తాన్ని నిశితంగా పరీక్షించాలి, వ్యాధి సోకిన వారితో లైంగిక సంబంధాలు కూడదు, రోడ్డుమీద బల్ల మీద అమ్మే ఆహారము తినకూడదు,  ఈ వ్యాధిని గుర్తించుటకు ఒక చి చిన్న రక్త పరీక్ష చాలు . కడుపుకు సంబంధించిన  స్కాన్, ఎన్ఆర్ఐ, సిటీ స్కాన్ కాలేయ రక్త పరీక్షలు,చేయించి హెపటైటిస్ టీకా  ఖచ్చితంగా తీసుకోవాలి : ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణం వైద్యుని సంప్రదించాలి అని  డి ది  పి ఎం పి అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖ బ్రాంచి కన్వీనర్ - ప్రజా వైద్యులు డాక్టర్ కుప్పిలి సురేష్ బాబు  మాట్లాడుతూ హెపటైటిస్ వ్యాధి పై ప్రారంభంలోనే చికిత్స తీసుకుంటే ఎటువంటి ప్రాణహాని ఉండదని తన వైద్య సేవలు అన్ని వేళలా అమలులో ఉంటాయని తెలిపారు.


జనసేవ వార్తలు దయచేసి ఈ పోస్ట్ అందరికీ పంచుకోండి